News January 13, 2026

కొండాపూర్: ‘వేసవికి తగ్గట్టుగా బీరు ఉత్పత్తి చేపట్టండి’

image

కొండాపూర్ మండలం మల్లేపల్లి బీరు, మద్యం తయారీ కంపెనీలను ఎక్సైజ్ సెక్రెటరీ రఘునందన్ రావు, కమిషనర్ సి.హరికిరణ్ సోమవారం పరిశీలించారు. వేసవి అవసరాలకు తగ్గట్టుగా బీర్ కంపెనీలు తమ ఉత్పత్తులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. బీర్ తయారీ విధానాన్ని పరిశీలించి పాటించావాల్సిన ప్రమాణాలు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 15, 2026

వర్ధన్నపేట ఛైర్మన్ ఎంపిక ఆమె చేతిలోనే!

image

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పురపాలిక ఛైర్మన్ ఎంపిక ఆమె చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్‌కు 5 స్థానాలు రాగా, బీఆర్ఎస్‌కు 6 స్థానాలు వచ్చాయి. ఎమ్మెల్యే ఓటుతో కాంగ్రెస్‌కు ఆరు స్థానాలు ఉండగా, స్వతంత్ర అభ్యర్థి శిబారాణి ఎటువైపు వెళ్తే అటే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికయ్యే స్పష్టత కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ క్యాంపులోనే శిబారాణి ఉన్నట్లుగా తెలుస్తుండగా, చివరి నిమిషంలో ఏం జరుగుతుందో ఉత్కంఠ నెలకొంది.

News February 15, 2026

CNF అంటే ఏంటో తెలుసా?

image

రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF అని వస్తే టికెట్ కన్ఫామ్ అయిందని అర్థం. కోచ్ నంబర్, బెర్త్ నంబర్ మీ టికెట్‌పై మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు CNF/D3/18/WS అంటే D3-కోచ్ నంబర్, 18- సీట్ నంబర్, WS- విండో సీట్. IRCTC లేదా అఫీషియల్ రైల్వే సైట్‌లో PNR నంబర్ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టేటస్ తెలుస్తుంది.
Share It

News February 15, 2026

తిరుపతి స్విమ్స్‌లో ఉద్యోగాలు

image

తిరుపతి స్విమ్స్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మెడికల్ ఆఫీసర్లు-4, స్టాఫ్ నర్సులు-4, ఏఎన్ఎం-4, మమోగ్రఫీ టెక్నీషియన్-2, కార్డియో వాస్క్యలర్ టెక్నీషియన్ గ్రేడ్-2, డీఏవో-2, పీఆర్వో-2, మెడికో సోషల్ వర్కర్-2, ఎలక్ట్రీషియన్62, డ్రైవర్లు-2 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు svimstpt.ap.nic.in వెబ్‌సైట్ చూడాలి.