News September 27, 2024
కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మస్థలం వాంకిడి

తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. 1952లో ఆసిఫాబాద్ నుంచి ఎన్నికై హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. 1971 వరకు శాసనసభ్యుడిగా కొనసాగాడు. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలు.
Similar News
News November 13, 2025
బోథ్: రెండు రోజులు సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేత

AMC బోథ్ మార్కెట్లో సోయా, మొక్కజొన్న కొనుగోళ్లు రెండు రోజులు నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్ఛార్జ్ గోలి స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. బోథ్ మార్కెట్లో అధిక మొత్తంలో పంట నిల్వ ఉండడంతో నవంబర్ 14 నుంచి 16 వరకు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. తిరిగి నవంబర్ 17 నుంచి యధావిధిగా కొనుగోళ్లు చేపడతామని, రైతులు గమనించి సహకరించాలని కోరారు.
News November 13, 2025
నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదు: ADB కలెక్టర్

విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాల కోసం అవసరమైన మీసేవ ధ్రువపత్రాలు పొందడానికి ఇకపై నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తహశీల్దార్ కార్యాలయాల్లో నోటరైజ్డ్ అఫిడవిట్ అడగడం వల్ల పేద ప్రజలకు అదనపు ధన వ్యయం, సమయ నష్టం జరుగుతున్నదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై అలాంటి అఫిడవిట్లు లేదా గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణ సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
News November 12, 2025
ఆదిలాబాద్: రేపు జోనల్ స్థాయి యోగా పోటీలు

ఇచ్చోడ మండలంలోని బోరిగామా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 14 – 17 సంవత్సరాల బాలబాలికలకు జోనల్ స్థాయి యోగా పోటీలను ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు DEO రాజేశ్వర్, SGF జిల్లా కార్యదర్శి రామేశ్వర్ పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి యోగా పోటీలు కరీంనగర్ జిల్లాలోని వెలిచల రామడుగు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉంటాయని పేర్కొన్నారు. 15, 16, 17 మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు.


