News August 14, 2024

కొండేపి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

మండలంలోని దాసరెడ్డిపాలెం గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గురువారెడ్డి తన సొంత పొలంలో విద్యుత్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొండేపి పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News January 8, 2026

మీ సమస్యలను సీఎంకు చెబుతా: గొట్టిపాటి

image

ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పలువురు రైతులు మంత్రి గొట్టిపాటికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను భారీగా పెంచడంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

News January 8, 2026

మార్కాపురం: వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్: ఎస్పీ

image

వృద్ధులే లక్ష్యంగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని SP హర్షవర్ధన్ రాజు అన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు అధికారులమని చెప్పి మీ పిల్లలపై కేసు ఉంది, ఇప్పుడే అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు దోచుకోవడమే డిజిటల్ అరెస్ట్ అని అన్నారు. అపరిచితుల వీడియో కాల్ ఎత్తవద్దని, బ్యాంకు వివరాలు చెప్పవద్దన్నారు. సైబర్ క్రైమ్ బాధితులు 1930కి కాల్ చేయాలని సూచించారు.

News January 8, 2026

మార్కాపురం: వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కాం: ఎస్పీ

image

వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు అధికారులమని చెప్పి మీ పిల్లలపై కేసు ఉంది.. ఇప్పుడే అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు దోచుకోవడమే డిజిటల్ అరెస్ట్ అన్నారు. అపరిచిత వీడియో కాల్ ఎత్తవద్దని, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దన్నారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కాల్ చేయండాని సూచించారు.