News February 15, 2025

కొండ్రావుపల్లి: భార్యాభర్తలపై దాడి

image

కొండ్రావుపల్లిలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. అందులో భార్యభర్తలకు గాయాలయ్యాయి. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పొలంలో అదే గ్రామానికి చెందిన అర్జున్‌రావు గేదె వచ్చి మేస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్జున్‌రావు, అతడి కుమారుడు బాబురావు వచ్చి శ్రీనివాసరావు దంపతులపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరి తలలకు తీవ్రగాయాలు కాగా.. వారిని హైదరాబాద్ తరలించారు. 

Similar News

News April 17, 2026

ముర్రా జాతి గేదెలతో ఎందుకు మేలంటే?

image

ముర్రా జాతి పశువు జీవితకాలం 20 ఏళ్లుగా ఉంటుంది. 10 ఈతలు ఈనడానికి అవకాశం ఉంటుంది. రెండున్నరేళ్ల నుంచి మూడేళ్ల వయసు మధ్యలో ముర్రా గేదెలు ఎదకు వస్తాయి. ఏటా ఈ గేదెలకు దూడ పుట్టడం పాడి రైతుకు లాభదాయకం. ముర్రా గేదెలు ఈనిన తర్వాత 3 నెలలకే మళ్లీ ఎదకు రావడం వాటిలో గొప్ప లక్షణం. తర్వాత పది నెలలకు ఈనుతుంది. ఇలా ప్రతి ఏడాదీ దూడ పుట్టడానికి, పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.

News April 17, 2026

హుండీలో వేసిన నాగ పడగలను ఏమి చేస్తారంటే..!

image

రాహుకేతు పూజల అనంతరం వెండి నాగ పడగలను భక్తుల చేతులతోనే హుండీలో సమర్పిస్తారు. అనంతరం హుండీలో నుంచి సేకరించిన నాగ పండుగలను చెన్నైకు తరలిస్తారు. అక్కడ ఈ వెండి నాగ పడగలను కరిగించి, తిరిగి నూతన నాగ పడగలు తయారు చేసి శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి తరలిస్తారు. మేకింగ్ ఛార్జెస్, ట్రాన్స్‌పోర్ట్ మినహా… ఆలయ దేవస్థానం వద్ద ఉన్న వెండితోనే రొటేషన్ అవుతూ వస్తుంది.

News April 17, 2026

NTR: నెలకో అధికారి బదిలీ.. ఆ శాఖకు ఏమైంది?

image

NTR జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖలో అధికారుల వరుస బదిలీలు అభివృద్ధికి శాపంగా మారాయి. గడిచిన 6 నెలల్లో నలుగురు SEలు మారడం గమనార్హం. అధికారులు ఇక్కడి పరిస్థితులు అవగాహన చేసుకునేలోపే బదిలీ అవుతుండటంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ నత్తనడకన సాగుతోంది. తిరువూరు కిడ్నీ బాధితులకు కృష్ణా జలాల సరఫరా హామీ ప్రకటనలకే పరిమితమైంది. పాలనాపరమైన అస్థిరతతో తాగునీటి ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా మారాయి.