News February 4, 2025

కొంపల్లి: సోదరి చిత్రపటానికి KCR నివాళి

image

కొంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ దశదిన కర్మకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సోదరి సకలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. నేడు కేసీఆర్ సహా BRS స్థానిక శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై, నివాళులర్పించారు.

Similar News

News February 5, 2025

మెదక్: 30 ఏళ్ల కల సాకారం: మంత్రి దామోదర్

image

30, 40 ఏళ్ల కల నేడు సాకారం అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. 30 ఏళ్ల ఉద్యమానికి నేడు పరిష్కారం దొరికిందని మంత్రి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది ఉండదన్నారు. వర్గీకరణ వల్ల కొందరిలో భయం, అభద్రతాభావం కలుగుతోందని, వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు.

News February 5, 2025

మంచిర్యాల కార్పొరేషన్‌ మాస్టర్ ప్లాన్‌కు ఏర్పాట్లు

image

మంచిర్యాల మున్సిపాలిటీని ప్రభుత్వం కార్పొరేషన్‌గా మార్చినందున మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు జీఐఎస్ ఆధారిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రోన్ సర్వే ప్రక్రియ పూర్తయిందని, బేసామ్యాప్ రూపొందించి సంబంధిత శాఖల ద్వారా వివరాలను సేకరించి పరిశీలిస్తామన్నారు.

News February 5, 2025

నిర్మల్ వైద్య కళాశాలలో JOBSపై UPDATE

image

నిర్మల్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో 52 ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా కళాశాల నోటీసు బోర్డుపై అందుబాటులో ఉంటుందని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ అధ్యక్సఉడు దుర్గం శేఖర్ తెలిపారు. ఈనెల 5 నుంచి 8 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!