News April 6, 2025

కొడంగల్‌లో విషాదం.. బాలుడి మృతి

image

కొడంగల్ మం.లో విషాదం నెలకొంది. ఎనికేపల్లిలో మణితేజ(9) తండ్రి బసంతప్పతో కలిసి ఎద్దులకు నీళ్లు పోసేందుకు నీటితొట్టి వద్దకు వెళ్లాడు. ఇదే సమయంలో గాలికి చెట్టుకొమ్మలు విరిగి కరెంటు తీగలపై పడ్డాయి. ఒక్కసారిగా కరెంటు వైరు మణితేజకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 18, 2025

విధుల పట్ల శ్రద్ధ వహించాలి: సంగారెడ్డి ఎస్పీ

image

పోలీసు సిబ్బంది విధుల్లో పూర్తి నిబద్ధతతో పనిచేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్ అన్నారు. సంగారెడ్డిలోని పోలీసు కార్యాలయంలో ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ డివైస్‌పై సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ తమ విధుల పట్ల శ్రద్ధ వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ పింకీ కుమారి ఉన్నారు.

News April 18, 2025

చైనా నన్ను కలవాలనుకుంటోంది: ట్రంప్

image

చైనా దిగుమతులపై US 245% టారిఫ్ విధించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య వివాదం ముదిరింది. US ఇలాగే టారిఫ్‌ల ఆట కొనసాగిస్తే దాన్ని పట్టించుకోబోమని చైనా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో చైనా తనను కలవాలని అనుకుంటోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల మెక్సికో, జపాన్ వాణిజ్య ప్రతినిధులతో ప్రయోజనకర సంభాషణ జరిగిందని, ఇలాగే ఆ దేశమూ చర్చలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, చైనా దీనిపై స్పందించాల్సి ఉంది.

News April 18, 2025

మాదాపూర్: మే 1 నుంచి సమ్మర్ ఆర్ట్ క్యాంప్

image

మాదాపూర్‌లోని శిల్పారామంలో ఏటా నిర్వహించే సమ్మర్ ఆర్ట్ క్యాంప్‌ను ఈ ఏడాది మే 1 నుంచి ప్రారంభం కానున్నట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా నిర్వహించే ఈ క్యాంపులో నామమాత్ర రుసుము, వయస్సుతో సంబంధం లేకుండా ఆసక్తి గలవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 8886652030, 8886652004 నంబర్లను సంప్రదించాలని కోరారు.

error: Content is protected !!