News January 26, 2025
కొడంగల్‌లో 4 పథకాలు ప్రారంభించనున్న సీఎం

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కోడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చంద్రవంచలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు పథకాలను ప్రారంభించనున్నారు. HYD మినహా మిగిలిన 606 మండలాల్లోని ఒక్కో గ్రామంలో నాలుగు పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Similar News
News February 8, 2025
GREAT.. WGL: ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. జఫర్‌గడ్ మండలంలో వీరు “మా ఇల్లు ఆశ్రమంలో” అనాథగా పెరిగిన విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. అనంతరం ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
News February 8, 2025
కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు వేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 10, 22 తేదీలలో రాత్రి 10.20 గంటలకు విశాఖ-గోరఖ్ పూర్ (08588) బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 13, 25 తేదీలలో సాయంత్రం 5:45కు గోరఖ్‌పూర్‌లో బయలుదేరునుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 8, 2025
హుజూరాబాద్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూరాబాద్‌లోని ఇందిరానగర్‌లో జరిగింది. పోలీసులా కథనమిలా.. గ్రామానికి చెందిన కోలుగోరి సుజిత్ (30) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంగీకరించకపోవడంతో పురుగు మందు తాగాడు. ఈ క్రమంలో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.