News April 4, 2025
కొడంగల్: ‘ఆస్తిపన్ను వసూళ్లలో రికార్డు’

ఆస్తిపన్ను వసూళ్లలో కొడంగల్ మున్సిపాలిటీ రికార్డు సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను 82.88 శాతం పన్ను వసూలు చేసినట్లు కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ టి కె. శ్రీదేవి చేతులమీదగా కమిషనర్ బలరాం నాయక్ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
Similar News
News December 2, 2025
NZB: వాహనదారులకు గమనిక

నవీపేట్-నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్నందున నవీపేట్ ప్రధాన రైల్వే గేటు రెండురోజుల పాటు మూసి వేయనున్నారు. రేపు ఉ.6 గంటల నుంచి గురువారం సా.6గంటల వరకు మూసివేయనున్నారు. కావున నిజామాబాద్ నుంచి బాసర, భైంసా, ధర్మాబాద్ వైపు వెళ్ళే వాహనదారులు జన్నేపల్లి మీదుగా వెళ్లాలని, అలాగే బాసర నుంచి జానకంపేట, బోధన్ వైపు వెళ్లే వారు ఫకీరాబాద్-సాటాపూర్ గేట్ వైపు వెళ్లాలని సూచించారు.
News December 2, 2025
పాలమూరు: నామినేషన్ అభ్యర్థుల చూపు పంచాంగాల వైపు..!

పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకునే ఆశావహులు నామినేషన్ల దాఖలు కోసం జాతకాలు, ముహూర్తాలు చూస్తున్నారు. ముహూర్తాలు చూడడం అనేది, లోకంలో మంచి-చెడు, తగిన-తగని అంశాలు ఉన్నట్లే.. ఆచారాలు పాటించడంలో ఇదొక అవసరమైన భాగంగా భావిస్తున్నారు. అందుకే శుభ ముహూర్తంలో నామినేషన్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు.
News December 2, 2025
వివాహానికి నిజమైన అర్థం అదే: జయా బచ్చన్

ప్రస్తుతం ఉన్న జనరేషన్కు పెళ్లి గురించి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సీనియర్ బాలీవుడ్ నటి జయా బచ్చన్ అన్నారు. ‘నేటి తరం పిల్లలకు మనం సలహాలు ఇవ్వలేం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు, అన్ని విషయాల్లో మనల్ని మించిపోయారు. అలాగే పెళ్లంటే ఇలానే ఉండాలి అని చెప్పడానికి సరైన నిర్వచనాలు లేవు. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలంతే’ అని జయ తెలిపారు.


