News March 26, 2025

కొడంగల్: తిరుపతిరెడ్డిపై పోస్ట్.. యువతిపై కేసు నమోదు

image

సీఎం రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తిరుపతిరెడ్డి ఈనెల 22న కోస్గి మండలం బిజ్జూరంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు SIబాల్‌రాజ్ తెలిపారు. తిరుపతిరెడ్డి భూకబ్జాలు చేసేందుకు వచ్చాడని హన్మాన్‌పల్లి వాసి పద్మ వాట్సాప్ గ్రూపుల్లో ఆధారాలు లేకుండా తప్పుడు మెసేజ్ చేసిందని NSUIఅధ్యక్షుడు అశోక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News November 27, 2025

‘పెద్దపల్లిలోనే న్యాయస్థానం ఏర్పాటు చేయాలి’

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే జిల్లా న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలంటూ పలువురు బార్ అసోసియేషన్ సభ్యులు బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డిని కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. న్యాయస్థానాన్ని జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావుకు సూచించారు. న్యాయవాదుల డిమాండ్‌కు భారతీయ జనతా పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

News November 27, 2025

బహు భార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించిన అస్సాం

image

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధ బిల్లును అస్సాం అసెంబ్లీ ఇవాళ పాస్ చేసింది. దీని ప్రకారం 2 లేదా అంతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. వివాహం సమయలో ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి దాచిన వారికి పదేళ్ల శిక్ష పడనుంది. ‘ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. బహుభార్యత్వాన్ని ఇస్లాం అంగీకరించదు’ అని CM హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

News November 27, 2025

హైదరాబాద్‌లో మరో మెగా GCC?

image

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) హబ్‌గా హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. మియామిన్ కార్ప్ సంస్థ ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ(బోయింగ్ లేదా ఎమిరేట్స్) కోసం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ GCCని నెలకొల్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా 1,000 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.