News March 28, 2024
కొడంగల్ నుంచి 50 వేల మెజార్టీ రావాలి: సీఎం
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి నిర్వహించే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం మూడంచెలుగా సమన్వయ కమిటీలు వేసుకొని పని చేయాలని, ఏప్రిల్ 8న కొడంగల్ మళ్లీ వచ్చి సమన్వయ కమిటీ సభ్యులతో ఎంత మెజార్టీ ఇస్తారో రాయించుకుని సంతకాలు తీసుకుంటానన్నారు. ఇవే సమన్వయ కమిటీలు తర్వాత నిర్వహించే ఇందిరమ్మ కమిటీలుగా రూపాంతరం చెందుతాయన్నారు.
Similar News
News January 11, 2025
MBNR: కురుమూర్తి స్వామి గిరి ప్రదక్షిణ.. హాజరైన భక్తులు
కురుమూర్తి స్వామి దేవాలయంలో ఈ ఏడాది నుంచి కొత్తగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. దేవాలయ చరిత్రలో తొలిసారిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. తొలిసారి నిర్వహించిన స్వామి వారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News January 11, 2025
MBNR: కొత్త రేషన్ కార్డులు.. చిగురించిన ఆశలు
సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో MBNR-30,345, GDWL-13,189, NGKL-28,773, NRPT-9,391, WNP-11,501 కలిపి మొత్తం 93,199 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి పాలమూరులో మొత్తం 9,26,636 రేషన్ కార్డులు ఉన్నాయి.
News January 11, 2025
MBNR: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వద్ద శుక్రవారం రాత్రి <<15122838>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు, లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను జడ్చర్ల ఆసుపత్రికి, క్షతగాత్రులను MBNR, జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రులకు పోలీసులు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.