News April 3, 2025
కొడంగల్: పిడుగుపాటుతో గొర్రెలు, మేకలు మృతి

కొడంగల్ మండలం ఖాజా అహ్మద్‌పల్లి గ్రామంలో పిడుగు పాటుతో గొర్రెలు, మేకలు మృతి చెందాయి. పకీరప్ప రోజు మాదిరిగా జీవాలను మేతకు వెళ్లారు. అకాల వర్షం నేపథ్యంలో దాదాపు 30 మేకలు, గొర్రెలు చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగు పడింది. దీంతో 25 జీవాలు మృతిచెందగా దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయన పకీరప్ప కోరుతున్నారు.
Similar News
News April 8, 2025
NGKL: శ్రీనిధి సమస్యలపై కేంద్రమంత్రికి వినతి

రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం పని చేస్తున్న శ్రీనిధి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం శ్రీనిధి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగపూరి రాము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. శ్రీనిధి సంస్థకు ఐఏఎస్‌ను కేటాయించాలని తెలిపారు. సంస్థ నుంచి రిటైర్డ్ ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవద్దని డిమాండ్ చేశారు.
News April 8, 2025
HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 8, 2025
MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.