News March 29, 2025

కొడంగల్ ప్రజలు రాష్ట్రన్ని పాలించే శక్తిని ఇచ్చారు: సీఎం

image

కొడంగల్ ప్రజలు రాష్ట్రాన్ని పరిపాలించే శక్తినిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందని దుఃఖం ఉండొచ్చు.. వాళ్లను పట్టించుకోవద్దన్నారు. వక్ఫ్ బిల్లు అంశాన్ని అక్బరుద్దీన్ కంటే మొదటగా లేవనెత్తింది తానే అన్నారు. ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

NTR: వీరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు

image

KRU పరిధిలోని కళాశాలలలో పీజీ కోర్సులలో వేకెంట్ సీట్ల భర్తీకై ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్‌ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని వర్సిటీ డైరెక్టర్ డా.ఎల్. సుశీల తెలిపారు. ఏపీ పీజీసెట్-2025 రాసి క్వాలిఫై కానివారు, ఆ పరీక్ష రాయనివారు స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చని, ప్రభుత్వ నిబంధనల మేరకు వీరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించదన్నారు. DEC 8న ఉదయం 10 గంటలకు KRU క్యాంపస్‌లో సంప్రదించాలన్నారు.

News December 6, 2025

వంటింటి చిట్కాలు

image

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.

News December 6, 2025

GNT: మంత్రి నారా లోకేశ్‌పై అంబటి ట్వీట్

image

మంత్రి నారా లోకేశ్‌పై గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ‘X’లో సెటైరికల్ ట్వీట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం మంత్రి లోకేశ్ చంద్రబాబు ప్లేటును తీస్తున్న ఓ ఫొటో షేర్ చేసి, ఇప్పుడు నువ్వు “తిన్న ప్లేటు” రేపు నువ్వు “కూర్చున్న సీటు” తీసేయడం కాయం.! అంటూ క్యాప్షన్ ఇచ్చి చంద్రబాబు, లోకేశ్‌లకు ట్యాగ్ చేశారు.