News March 19, 2025
కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు, ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బల్లునాయక్ తండా వాసి ధనావత్ పవన్ కుమార్(23) NRPT జిల్లా కొడంగల్ పరిధి మద్దూర్ మండలానికి చెందిన 17ఏళ్ల బాలికను ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా ఈరోజు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.
Similar News
News November 3, 2025
అచ్చంపేట: రేషన్ గోదాంలో 257 క్వింటాళ్ల దొడ్డు బియ్యం

2024 ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. నిల్వ ఉన్న దొడ్డు బియ్యం గురించి సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యం చేశారు. దీంతో అచ్చంపేట పట్టణంలోని సివిల్ సప్లై గోదాంలో 257 క్వింటాళ్ల దొడ్డు రేషన్ బియ్యం ఏడాది కాలంగా తుట్టెలు కట్టి, పురుగులు పట్టీ ముక్కి పోతున్నాయి. అదే గోదాంలలో నిల్వ ఉన్న సన్న బియ్యనికి కూడ పురుగులు పడుతున్నాయి.
News November 3, 2025
మల్కపేట రిజర్వాయర్‌లో చేప పిల్లలు విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌లో చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి ప్రారంభించారు. కులవృత్తుల అభ్యున్నతి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
News November 3, 2025
కార్తీక పౌర్ణమి: తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో ఏం చేస్తారంటే..?

కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు అభిషేకించిన అన్నాన్ని ప్రసాదంగా పంచి పెడతారు. ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని వీక్షించి, ప్రసాదంగా కొంచెం అన్నాన్ని స్వీకరించడం వలన ఎలాంటి రోగాలైన పోతాయని, సమస్త పాపాలు నశించిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్తున్న భక్తులకిది మంచి అవకాశం.


