News March 19, 2025
కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు, ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బల్లునాయక్ తండా వాసి ధనావత్ పవన్ కుమార్(23) NRPT జిల్లా కొడంగల్ పరిధి మద్దూర్ మండలానికి చెందిన 17ఏళ్ల బాలికను ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా ఈరోజు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.
Similar News
News March 20, 2025
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్ సరఫరా, పంటల విస్తీర్ణం తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. చెరువులు, కుంటలు కబ్జా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 20, 2025
మహబూబ్‌నగర్: ‘పెండింగ్ లేకుండా ట్యాక్స్ చెల్లించాలి’

మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని ప్రజలు మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ లేకుండా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం మొత్తంగా రూ.1.92 లక్షల ట్యాక్స్ వసూలు చేసినట్టు వెల్లడించారు. స్వచ్ఛందంగా ప్రజలు తమ ఇంటి, వ్యాపార సముదాయాలకు సంబంధించిన టాక్స్‌లను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News March 20, 2025
దేవరకద్ర: పాలమూరు-రంగారెడ్డికి నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు: ఆల

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. పాలమూరు జిల్లా నుంచి తాను సీఎం అయ్యానని, ఈ జిల్లాకు అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి అన్న మాటలు డొల్ల మాటలేనన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ సర్కార్ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.