News February 12, 2025
కొడంగల్: బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్

దుద్యాల మండలంలోని పోలేపల్లి శ్రీరేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 21న ప్రధాన ఘట్టం సిడె కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారని ఆలయ మేనేజర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ జయరాములు, నాయకులు మెరుగు వెంకటయ్య, సీసీ వెంకటయ్యగౌడ్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
చలాన్లు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్?

TG: ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై చర్యలకు రవాణాశాఖ సిద్ధమైంది. మూడు నెలల పాటు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్ చేయాలన్న పోలీసుల ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు కళ్లెం వేయడంతో పాటు భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత 7 నెలల్లో పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 18,973 మంది లైసెన్స్‌లను అధికారులు సస్పెండ్ చేశారు.
News July 8, 2025
కామారెడ్డి మెడికల్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్

కామారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా వాల్యను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్స్ విభాగంలో హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ డా.వాల్య ప్రమోషన్ పై జిల్లా మెడికల్ కళాశాలకు పిన్సిపల్‌గా రానున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
News July 8, 2025
మహబూబాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్

కాచిగూడ నుంచి మహబూబాబాద్, డోర్నకల్ మీదుగా తిరుపతి వెళ్లడానికి స్పెషల్ ట్రైన్ నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే ఎస్టీఎం రాజనర్సు తెలిపారు. కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ స్పెషల్ ట్రైన్ జులై 10, 17, 24, 31 తేదీల్లో నడుపుతున్నామని ప్రయాణికులు గమనించాలని సూచించారు.