News March 27, 2025
కొడంగల్: భూమి పూజ చేసిన సీఎం సోదరుడు

కొడంగల్ పరిధి మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల గ్రామంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి భూమి పూజా కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌తో పాటు, కడా ఛైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 23, 2025
పది ఫలితాలలో 13 నుంచి 8వ స్థానానికి ఎన్టీఆర్ జిల్లా

2024- 25లో పది పరీక్షల ఫలితాలలో రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా 8వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 88.76% ఉత్తీర్ణత శాతంతో 13వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడు 5 స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరుకుంది. జిల్లాలో 27,467 మంది పరీక్షలు రాయగా 23,534(85.68) మంది పాసయ్యారు. మండలాలవారీగా ఉత్తీర్ణత శాతం తెలియాల్సి ఉంది.
News April 23, 2025
HNK: ఇంటర్ ఫలితాల్లో ‘వేలేరు గురుకులం’ విజయదుందిబి!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో HNK జిల్లా వేలేరు గురుకుల కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి విజయదుందుబి మోగించారు. ఎంపీసీలో నందకిషోర్ 986/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. బైపీసీలో రాహుల్‌కు 980/1000 మార్కులు లభించాయి. ఎంపీసీలో సాయి గణేశ్ 464/470 మార్కులు, బైపీసీలో శశాంత్ 420/440 మార్కులు సాధించారు. విద్యార్థులను, స్టాఫ్‌ను ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ కుమార్ అభినందించారు.
News April 23, 2025
ఉమ్మడి ప.గో జిల్లాలో 10Th ఉత్తీర్ణత శాతం ఇలా..

10వ తరగతి ఫలితాల్లో ఉమ్మడి ప.గో. జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గతేడాదితో పోల్చితే ఈసారి ప.గో.జిల్లా మెరుగుపడగా ఏలూరు జిల్లా కాస్త తగ్గింది. ➤ ప.గో.జిల్లాలో గతేడాది 81.82% ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 82.15% శాతంతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. ➤ ఏలూరు జిల్లా విద్యార్థులు గతేడాది 80.08% శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. ఈ ఏడాది 77.24% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది.