News February 1, 2025
కొడంగల్: ‘మైక్రో బ్యాక్టీరియా లెప్రతో కుష్ఠు వ్యాధి’

కొడంగల్ మండలంలోని పెద్దనందిగామ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు కుష్ఠు వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పించారు. కుష్ఠు వ్యాధి మైక్రో బ్యాక్టీరియా లెప్ర అనే బ్యాక్టీరియా నుంచి వస్తుందని, వ్యాధి తుమ్మడం, దగ్గడం ద్వారా వ్యాప్తి చెందుతుందని, వ్యాధి లక్షణాలు 3 నుంచి 5 సంవత్సరాల్లో కనిపిస్తాయని వైద్యుడు మహేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అనురాధ, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News December 18, 2025
ఖమ్మం: 99 సర్పంచి స్థానాల్లో ఎర్రజెండా రెపరెపలు

కమ్యూనిస్టుల కోటగా పేరుగాంచిన ఉమ్మడి ఖమ్మంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎర్రజెండా మరోసారి తన సత్తా చాటింది. జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు 99 స్థానాలను కైవసం చేసుకుని తమ పట్టు నిరూపించుకున్నాయి. ఇందులో CPI 56, CPM 37, CPI (ML) న్యూడెమోక్రసీ 6 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశాయి. కొన్నిచోట్ల అధికార కాంగ్రెస్, మరికొన్ని చోట్ల BRSతో సాగించిన అవగాహన వామపక్ష అభ్యర్థుల విజయానికి బాటలు వేసింది.
News December 18, 2025
పుస్తకాల పండుగ రేపటి నుంచే

TG: హైదరాబాద్‌లో రేపటి నుంచి నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం 365 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 వరకు బుక్ ఫెయిర్ ఓపెన్‌లో ఉంటుంది. గతేడాది 10 లక్షల మంది వచ్చారని, ఈ ఏడాది 12-15 లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి దివంగత కవి అందెశ్రీ పేరు పెట్టారు.
News December 18, 2025
హన్మకొండ జిల్లాలో ఓట్ల శాతం ఎంతంటే?

HNL జిల్లాలో 2019 జనవరిలో జీపీ ఎన్నికలు 7 మండలాల్లోని 130 జీపీలకు జరగగా, ఒంటిమామిడిపల్లి మినహా 129 జీపీలకు 3 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. 2 ఎన్నికలను పోల్చితే 2019లోనే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. అప్పట్లో ఐనవోలు మండలంలో 90% పోలింగ్ నమోదైంది. ఫేజ్ వారీగా 2019లో తొలి దశ 89.02%, 2వ దశ 86.83%, 3వ దశ 88.80% పోలింగ్ పోలింగ్ కాగా, 2025లో తొలి దశ 83.95%, 2వ దశ 87.34%, 3వ దశలో 86.44% పోలింగ్ అయింది.


