News March 24, 2025
కొడంగల్: యువకుడి మరణంపై కేసు నమోదు

కొడంగల్ పరిధి మద్దూర్ మండలం గోకుల్‌నగర్‌కు చెందిన యువకుడు సాయికుమార్ (22) <<15867432>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. సాయికుమార్ వ్యవసాయం చేస్తూ ఏడాది నుంచి ఊరిలోని ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఇటీవల తండ్రి రాములుకు చెప్పాడు. తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి చనిపోయాడు. తల్లి భీమమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 23, 2026
కామారెడ్డి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాధ్యతలు స్వీకరణ

కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డా.రవీందర్ గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయణ్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(I/C)గా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇటీవల నియమించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించి, పలువురు అధికారులతో జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ సేవలపై చర్చించారు. PH&MEU జిల్లా కమిటీ అభినందించారు.
News February 23, 2026
ఆదిలాబాద్: జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా పాలిటెక్నిక్

పాలిటెక్నిక్‌లను జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా ఉన్నతీకరించామని, ఉపాధి అవకాశాల కోసం వీటిలో చేరాలంటూ సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక ప్రచారం ప్రారంభించిందని ADB సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నరేశ్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు POLYCETపై అవగాహన కల్పించామన్నారు. ఈ సంవత్సరంకొత్త కోర్సులు అందుబాటులో వచ్చాయన్నారు.
News February 23, 2026
అమెజాన్.. బెంగళూరులో 2వ అతిపెద్ద క్యాంపస్

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ బెంగళూరులో ఆసియాలోనే 2వ అతిపెద్ద ఆఫీసును స్టార్ట్ చేసింది. ఐదెకరాల్లో నిర్మించిన ఈ క్యాంపస్‌ను కర్ణాటక మంత్రి MB పాటిల్ ప్రారంభించారు. ఇందులో 7,000 మంది పని చేసేందుకు సౌకర్యాలు కల్పించారు. అమెజాన్ భారత్‌లో ఇప్పటికే 40 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టగా, 2030 నాటికి అదనంగా మరో 35 బిలియన్ డాలర్లను యాడ్ చేయనున్నట్లు తెలిపింది. అతిపెద్ద క్యాంపస్ HYDలో ఉంది.


