News March 24, 2025

కొడంగల్: యువకుడి మరణంపై కేసు నమోదు

image

కొడంగల్ పరిధి మద్దూర్ మండలం గోకుల్‌నగర్‌కు చెందిన యువకుడు సాయికుమార్ (22) <<15867432>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. సాయికుమార్ వ్యవసాయం చేస్తూ ఏడాది నుంచి ఊరిలోని ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఇటీవల తండ్రి రాములుకు చెప్పాడు. తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి చనిపోయాడు. తల్లి భీమమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 22, 2025

నేడు సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ ఇవాళ సౌదీ అరేబియాకు బయలుదేరనున్నారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు జెడ్డాలో ఆయన రెండు రోజులు పర్యటించనున్నారు. మోదీ, సల్మాన్ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ పర్యటనలో భారీ సంఖ్యలో ఒప్పందాలపై సంతకాలతో పాటు ఆర్థిక, మిలిటరీ భాగస్వామ్యం, రాజకీయ సంబంధాలపై చర్చ జరగనుందని సౌదీలోని భారత అంబాసిడర్ అజాజ్ ఖాన్ వెల్లడించారు.

News April 22, 2025

శ్రీకూర్మం: పుణ్యక్షేత్రంలో.. పాపం చేసింది ఎవరు..?

image

శ్రీకూర్మం గ్రామంలోని శ్రీ కూర్మనాధుని క్షేత్రంలో తాబేళ్లు మృతిచెందిన ఘటన సోమవారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాబేళ్లను ఆలయ శ్వేతపుష్కరని సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చివేయడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. పుణ్యక్షేత్రంలో పాపం చేసింది ఎవరు? తాబేళ్లు మృతిపై ఆలయ సిబ్బంది ఎందుకు గోప్యంగా ఉంచారు? దీని వెనుక కారణాలు ఏంటి.. కారకులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

News April 22, 2025

చిట్యాల: రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

image

చిట్యాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జహీర్ పటేల్ అనే వ్యక్తి బీదర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. కంటైనర్‌ను పక్కకు ఆపి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేయడానికి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!