News February 25, 2025
కొడంగల్: రైతుల భాగస్వామ్యం అభినందనీయం: కలెక్టర్

కొడంగల్ ప్రాంత అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం అభినందనీయమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు సమ్మతించిన దుద్యాల మండలం లగచర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 102లోని 22మంది రైతులకు రూ.6.38 కోట్ల చెక్కులను ఆయన ఆదివారం అందజేశారు. సబ్-కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్, లైబ్రరీ ఛైర్మన్ రాజేష్ రెడ్డి ఉన్నారు.
Similar News
News November 20, 2025
వరంగల్ కలెక్టర్ను అభినందించిన ఎమ్మెల్యే రేవూరి

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరీ-2లో తొలి స్థానం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అభినందించారు. డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు, రూ. కోటి బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన కలెక్టర్ ను ప్రశంసించారు.
News November 20, 2025
HYD: రాజమౌళిపై PSలో ఫిర్యాదు

HYD రామోజీ ఫిల్మ్ సిటీలో హీరో మహేశ్ బాబు నటించిన వారణాసి సినిమా టైటిల్ రిలీజ్ ఈవెంట్లో హనుమంతుడిపై సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అనుచిత వ్యాఖ్యలు చేశారని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు కె.శివ కుమార్ అన్నారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని కోరుతూ న్యాయవాది వినోద్తో కలిసి అబ్దుల్లాపూర్మెట్ PSలో ఫిర్యాదు చేశారు.
News November 20, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు ఆది సాయికుమార్

వరంగల్ భద్రకాళి అమ్మవారిని గురువారం ప్రముఖ సినీ నటుడు ఆది సాయికుమార్ దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు శేషు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి శేష వస్త్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త వీరన్న, అధికారులు క్రాంతి కుమార్, సీనియర్ అసిస్టెంట్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.


