News January 29, 2025

కొడంగల్: వాహనాల పన్ను బకాయి రూ.2కోట్లు.! 

image

వాహనదారులు తమ వాహనాన్ని మొబైల్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. లింక్ చేయడంతో లైసెన్సు రెన్యూవల్, ఫిట్నెస్ రెన్యూవల్, టాక్స్ పేమెంట్స్ తదితర సమాచారం మొబైల్ ఫోన్ అలర్ట్‌కు పొందవచ్చు అన్నారు. జిల్లాలో దాదాపు 5వేలకు పైగా వాహనాల పన్ను బకాయిలు దాదాపు రూ. 2కోట్లు ఉన్నాయని తెలిపారు. 

Similar News

News December 17, 2025

BREAKING: సంగారెడ్డి జిల్లాలో తొలి ఫలితం

image

నాగలిగిద్ద మండలం శమా తండా సర్పంచిగా మారుతి మహారాజ్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మారుతి మహారాజ్ సమీప ప్రత్యర్థిపై 63 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

News December 17, 2025

మూడో విడత.. మహబూబాబాద్ జిల్లాలో తొలి ఫలితం

image

మరిపెడ మండలం ఎల్లారిగూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బానోతు శాంతి మల్సూర్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 240 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

News December 17, 2025

బాదనహాల్ రైల్వే స్టేషన్ ప్రారంభం

image

డి.హిరేహాల్ మండలం బాదనహాల్ రైల్వే స్టేషన్‌ను రైల్వే అధికారులు బుధవారం ప్రారంభించారు. రాయదుర్గం -సోమలాపురం రైల్వే స్టేషన్ల మధ్య ఇటీవల కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు. మంగళవారం ఈ రూటులో పలు రైళ్లు రద్దు చేసి బాదనహాల్ స్టేషన్‌లో లైన్ మార్పిడి చేశారు. అనంతరం రైలును ఈ ట్రాక్‌పై నడిపి ట్రయల్ రన్ చేశారు. నూతన బిల్డింగ్‌ను ప్రారంభించారు. పలువురు హుబ్లి డివిజన్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.