News January 29, 2025
కొడంగల్: వాహనాల పన్ను బకాయి రూ.2కోట్లు.!

వాహనదారులు తమ వాహనాన్ని మొబైల్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. లింక్ చేయడంతో లైసెన్సు రెన్యూవల్, ఫిట్నెస్ రెన్యూవల్, టాక్స్ పేమెంట్స్ తదితర సమాచారం మొబైల్ ఫోన్ అలర్ట్‌కు పొందవచ్చు అన్నారు. జిల్లాలో దాదాపు 5వేలకు పైగా వాహనాల పన్ను బకాయిలు దాదాపు రూ. 2కోట్లు ఉన్నాయని తెలిపారు.
Similar News
News February 9, 2025
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఫిబ్రవరి 09, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 9, 2025
నేటి నుంచి కుప్పం-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలు

కుప్పం-బెంగళూరు మధ్య నేటి నుంచి యధావిధిగా రైళ్ల రాకపోకలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కుప్పం రైల్వే ట్రాక్ పనుల కారణంగా గడిచిన 15 రోజులుగా కుప్పం-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకల్లో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కుప్పం ప్రాంతానికి చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఆదివారం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
News February 9, 2025
హైదరాబాద్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిగింది. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని సీఎం అన్నారు. రోడ్ల వెడల్పుపైనా పలు సూచనలు చేశారు.