News March 24, 2025
కొడంగల్: విషాదం.. యువకుడి మృతి!

యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 25, 2025
నంద్యాల: అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్‌కు ప్రజా సమస్యలు వెల్లువెత్తాయి. అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇప్పిస్తానని ఇమాన్యుల్ అనే వ్యక్తి రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని కాశమ్మ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా సివిల్ కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. చట్టపరిధిలో పరిష్కారం అయ్యే కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పరిష్కార వేదికకు 82 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.
News November 25, 2025
ప్రకాశం జిల్లా గురుకులాల్లో టీచర్ ఉద్యోగాలు.!

ప్రకాశం జిల్లా కో-ఆర్డినేటర్ జయ పార్ట్‌టైం టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. చీమకుర్తి బాలికల గురుకులాల్లో JL బోటనీ, మార్కాపురం బాలికల గురుకులాల్లో JL మ్యాథమెటిక్స్, కొండేపిలో TGT ఫిజికల్ సైన్స్ విభాగాలకు దరఖాస్తులు అందుకుంటున్నారు. డిసెంబర్ ఒకటిలోగా చీమకుర్తి గురుకులంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. 2వతేదీ 11 AMకి చీమకుర్తి గురుకులంలో డెమో క్లాస్ ఉంటుందన్నారు.
News November 25, 2025
కడప జిల్లా హెడ్ క్వార్టర్‌కు ప్రొద్దుటూరు సీఐ..!

ప్రొద్దుటూరు 1టౌన్ సీఐ తిమ్మారెడ్డిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించి అక్కడ రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. బంగారు వ్యాపారి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామిపై డబ్బు ఎగవేత, చీటింగ్, కిడ్నాప్ ఫిర్యాదులున్నాయి. ఈ కేసుల్లో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ తిమ్మారెడ్డి విచారణ చేపట్టారు. విచారణ తీరుపై సీఐపై ఆరోపణలొచ్చి ఆయనను హెడ్ క్వార్టర్‌కి పంపినట్లు సమాచారం.


