News March 24, 2025
కొడంగల్: విషాదం.. యువకుడి మృతి!

యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.
Similar News
News October 27, 2025
కోర్టు విచారణలు AIతో చకచకా

కోర్టుల్లో లక్షల కేసులు ఏళ్లపాటు పెండింగ్లో ఉంటున్నాయి. ఇందుకు అనేక కారణాల్లో సిబ్బంది, వనరుల కొరత ఒకటి. దీనికి AI చక్కటి పరిష్కారం చూపుతోంది. ఇప్పటికే దేశంలోని 4వేల కోర్టులు AIని అడాప్ట్ చేసుకొని న్యాయప్రక్రియను స్పీడప్ చేస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు లాయర్లు రూపొందించిన ‘అదాలత్ ఏఐ’ టూల్ కోర్టు రూమ్ రూపాన్ని మార్చేస్తోంది. స్టెనో, టైపిస్టులతో పనిలేకుండా రియల్ టైమ్లో ప్రొసీడింగ్స్ ఇస్తోంది.
News October 27, 2025
కాకినాడ వాతావరణం ప్రశాంతంగా ఉంది: పోలీసులు

కాకినాడ జిల్లా తీర ప్రాంతం అతలాకుతలం అంటూ కొందరు ఫేక్ వీడియో వైరల్ చేస్తున్నారు. దీనిపై జిల్లా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మవద్దని కోరారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు ఇచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని సూచించారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దన్నారు. కాకినాడ జిల్లాలో వాతావరణం ప్రశాంతంగా ఉందని స్పష్టం చేశారు.
News October 27, 2025
జీకేవీధి: అంతర్రాష్ట్ర సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత

మొంథా తుఫాను నేపథ్యంలో విశాఖ నుంచి జీకేవీధి మండలం సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను సోమవారం సాయంత్రం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విశాఖ ఆర్టీసీ డిపో మేనేజర్ మాధురి తెలిపారు. తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 29వరకూ నిలిపివేస్తున్నామన్నారు.


