News February 20, 2025

కొడంగల్: సీఎం రేవంత్ పర్యటనకు పటిష్ట బందోబస్తు

image

సీఎం హోదాలో మొదటి సారిగా పోలేపల్లి ఎల్లమ్మ దర్శనం కోసం వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21న సీఎం రానుండటంతో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పోలేపల్లిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Similar News

News September 19, 2025

మేడారం జాత‌ర మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం: మంత్రులు

image

TG: తెలంగాణ కుంభ‌మేళాగా పిలుచుకొనే మేడారం జాత‌ర‌కు మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ మాస్ట‌ర్ ప్లాన్‌కు CM రేవంత్‌ ఆమోదం ల‌భించగానే ఆధునికీకర‌ణ ప‌నులు ప్రారంభించి.. వంద‌రోజుల్లోగా పూర్తయ్యేలా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏర్పాట్ల విషయంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలు, సలహాలు తీసుకున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.

News September 19, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 19, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 19, 2025

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట వాసి

image

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట పట్టణం వైబిఎన్ పల్లెకు చెందిన పోతుగుంట రమేశ్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.