News January 27, 2025

కొడిమ్యాల: ఆచూకీ దొరకని పులి జాడ

image

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఈ నెల 23న ఆవుపై పులి దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, పులి సంచారంతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించి, పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా ఇంకా సీసీ కెమెరాలో పులి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆ గుట్టకు అనుకొని మల్యాల మండలంలోని ఓబులాపూర్, గొర్రెగుండం గ్రామాల గుట్టలు ఉన్నాయి.

Similar News

News November 21, 2025

బాపట్ల: ‘మత్స్యకారులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక’

image

మత్స్యకారులు, ఆక్వా ఫార్మర్లు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ అన్నారు. నిజాంపట్నం సైక్లోన్ భవన్ వద్ద శుక్రవారం జరిగిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వేడుకల్లో డీఆర్ఓ పాల్గొన్నారు. గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు ప్రసాద్ అన్నారు.రాష్ట్ర అగ్నికుల క్షత్రియ ఛైర్మన్ పాపారావు పాల్గొన్నారు.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.