News March 11, 2025

కొడుకులు పట్టించుకోవడం లేదు.. కలెక్టర్‌కు దంపతుల ఫిర్యాదు

image

వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కొడుకులు పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్‌ రాహుల్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దేశి కోడయ్య (91), శివలక్ష్మి (85) దంపతులకు సత్యనారాయణ, కాశీనాథ్ కుమారులున్నారు. ఆస్తులన్నీ తీసుకున్న కొడుకులు వృద్ధాప్యంలో పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వృద్ధులకు న్యాయం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News July 5, 2025

మెదక్: IIITకి 345 మంది ఎంపిక

image

బాసర IIITకి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 345 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా జిల్లాల విద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నుంచి 222 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మెదక్ నుంచి 78, సిద్దిపేట నుంచి 45 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వెల్లడించారు. IIITకి ఎంపికైన విద్యార్థులను ఆయా జిల్లాల విద్యాధికారులు అభినందించారు.

News July 5, 2025

జిల్లాలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: కలెక్టర్

image

మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమాజానికి చీడ పురుగులా మారిన మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.

News July 5, 2025

పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

image

సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం, వసతి సౌకర్యాలపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.