News August 30, 2024

కొడుకు మరణ వార్త విని తల్లి మృతి

image

కొడుకు మరణ వార్త విని ఆ బాధను తట్టుకోలేక తల్లి మరణించిన సంఘటన శుక్రవారం చండ్రుగొండ మండలం తుంగారం గ్రామపంచాయతీ వెంగళరావు కాలనీలో చోటుచేసుకుంది. గూగుల్ సాగర్ (21) పురుగుల మందు తాగి గురువారం మరణించారు. ఈ వార్త విన్న తల్లి తట్టుకోలేక శుక్రవారం హఠాన్మరణం చెందారు. తల్లి కొడుకుల మృతి పట్ల ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 13, 2025

‘యంగ్ ఇండియా గురుకులాలను వేగవంతంగా నిర్మించాలి’

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయ భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం సంబంధించి బిల్లులు 24 గంటల లోపు క్లియర్ చేయాలని, పనులు ఎక్కడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు.

News October 13, 2025

ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం (EVM) గోడౌన్‌ను కలెక్టర్ అనుదీప్ సోమవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు.ఈవీఎం, వీవీ ప్యాట్‌లు ఉన్న గది సీల్‌ను కలెక్టర్ పరిశీలించారు. గోడౌన్‌లో ఫైర్ అలారం, అగ్నిమాపక యంత్రాల కండిషన్‌ను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్‌లో కలెక్టర్ సంతకం చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

News October 13, 2025

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డా.శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.