News December 1, 2024
కొడుకు లేడని తెలిసి.. తల్లి మరణం

కంకిపాడులో శనివారం మిని వ్యాన్ను ఓ కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏసుబాబు అనే వ్యక్తి మరణవార్త విన్న తన తల్లి సుధారాణి (60) కుప్పకూలింది. తన కొడుకు మరణ వార్త తట్టుకోలేక కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కూడా మరణించింది. కాగా ఈ విషాద ఘటనలు చూపరులను కంటతడి పెట్టించాయి. వీరి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Similar News
News December 5, 2025
‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో విజయగాధలను ప్రసారం చేయండి: కలెక్టర్

వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు ఆఫీస్లో అధికారులతో ఆయన సమావేశమయ్యీరు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలను ‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో ప్రతి రోజు వాటిని ప్రసారం చేయాలన్నారు.
News December 5, 2025
ఈ నెల 8న కృష్ణా వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు

కృష్ణా విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధుల కోసం ఈ నెల 8వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎల్. సుశీల ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు హాజరు కానీ వారు, అర్హత సాధించని వారు కూడా అర్హులేనని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తమ సర్టిఫికెట్లతో ఈ నెల 8వ తేదీన అభ్యర్ధులు స్వయంగా రిపోర్ట్ చేయాలన్నారు.
News December 5, 2025
సాకారం దిశగా మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్కు లైన్ క్లియర్ అవుతోంది. MP వల్లభనేని బాలశౌరి కృషి ఫలిస్తోంది. మచిలీపట్నం-రేపల్లెకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 45 KM మేర రైల్వే లైన్ ఏర్పాటుకు DPR తయారీకి ఫీల్డ్ సర్వే పనులు జరుగుతున్నాయని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


