News February 7, 2025
కొణిజర్ల: కాల్వలో ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన గురువారం కొణిజర్ల మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..పెద్దగోపతికి చెందిన తడికమళ్ల రవి తన మిత్రులతో కలిసి మొక్కజొన్న పంటకు నీరు కట్టేందుకు ట్రాక్టర్‌పై జనరేటర్ తీసుకుని బయలుదేరాడు. రాపల్లె మేజర్ కాల్వ మీదుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కాల్వలో పడింది. రవిపై ఇంజిన్ తిరగబడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News February 8, 2026
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10న ఖమ్మంలో జాబ్ మేళా

ఖమ్మం టేకులపల్లి ITI మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. 21-35 సం.ల వయస్సు, ఏదైనా డిగ్రీ కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.2.4 లక్షల నుంచి రూ.3.5 లక్షలు ఉంటుందని, జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 8, 2026
ఖమ్మం: కర్మకాండలకు వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

బంధువుల ఇంట్లో కర్మకాండలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. తిరుమలాయపాలెం మండలం జల్లెపల్లికి చెందిన సుతారీ మేస్త్రి అన్నెపర్తి ఎల్లయ్య శనివారం రాత్రి బైక్‌పై వస్తుండగా.. జిన్నింగ్ మిల్లు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 8, 2026
‘మధిర అంటే నాకు ప్రాణం’ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘మధిర అంటే నాకు ప్రాణం..నా జన్మధన్యమయ్యేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మధిర పట్టణాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు.


