News March 29, 2025
కొణిజర్ల: సాగర్ కాల్వలో మునిగి బాలుడు మృతి

సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు సాగర్ కెనాల్‌లో మునిగి కన్నుమూశాడు. కొణిజర్ల ఎస్ఐ సూరజ్ తెలిపిన వివరాలు.. తనికెళ్లకు చెందిన బత్తుల కనకారావు కుమారుడు సాయి(15) స్థానిక జెడ్పీహెచ్ఎస్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఒక పూట బడికి వెళ్లొచ్చిన ఆయన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామ సమీపాన బోనకల్ బ్రాంచి కెనాల్‌లో ఈతకు వెళ్లాడు. అయితే, కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగి మృతి చెందాడు.
Similar News
News April 3, 2025
అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం

అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట <<15975525>>పెద్దిరెడ్డిగూడెం <<>>పంచాయతీ టిడి బంజరలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకొని ఇంట్లో నిద్రిస్తున్న పెరాలసిస్ బాధితుడు గౌస్ పాషా(35) సజీవ దహనం అయ్యాడు. మరో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. పంచాయతీ ట్రాక్టర్‌తో మంటలను అదుపు చేశామన్నారు.
News April 3, 2025
ఖమ్మం మార్కెట్‌కు భారీగా మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మిర్చి పోటెత్తింది. నాలుగు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవడంతో 70వేలకు పైగా మిర్చి బస్తాలతో మార్కెట్ నిండిపోయింది. మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గడమే కాక.. కొద్దిరోజులుగా మరింత పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2వేల మేర ధర తగ్గింది.
News April 3, 2025
ఖమ్మం జిల్లాకు వర్ష సూచన

ఖమ్మం జిల్లాలోని ఈ నెల 5వరకు పలు చోట్ల ఈదురు గాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని వెల్లడించింది. దీంతో జిల్లాలో నమోదయ్యే 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దీంతో పంటలు నాశనమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.