News January 31, 2025
కొత్తకోట: పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

కొత్తకోట పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన రాణి తన ఐదేళ్ల కూతురు, మూడేళ్ల కుమారుడితో కలిసి ఈనెల 23న శ్రీశైలం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి శంకరమ్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాణి భర్త నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఆనంద్ తెలిపారు.
Similar News
News February 20, 2025
గర్భాలు నిలబడటం లేదు!

వెనకటి తరాల వారు పదిమంది పిల్లల్ని కనేవారు. కానీ నేడు గర్భం దాల్చడమే గగనమవుతోంది. మరికొంతమందిలో గర్భాన్ని నిలబెట్టుకోవడం సమస్య అవుతోంది. రెండు మెట్లెక్కితే చాలు గర్భస్రావం అయిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారిన జీవనశైలి, స్త్రీపురుషులిద్దరిలోనూ తగినంత దృఢత్వం లేకపోవడం, ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు.
News February 20, 2025
ఉప్పల్: బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటేనే ఆరోగ్యం..!

సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే సాధారణ బరువు, బీపీ, షుగర్ నార్మల్ ఉండాలని ఉప్పల్ UPHC డాక్టర్లు అన్నారు. ఇవి నార్మల్ ఉంటే ఆరోగ్యకరమైన మనస్సు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు, కాలేయం, గుండె ఆరోగ్యకరంగా ఉండి మన జీవనం పచ్చని ఆకులు కలిగిన చెట్టుల ఉంటుందన్నారు. అదే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే మానసిక రుగ్మతలు, క్యాన్సర్, గుండెపోటు,కిడ్నీ వైఫల్యాలతో ఎండిపోయిన చెట్టులా మన పరిస్థితి మారుతుందన్నారు.
News February 20, 2025
మెదక్: ఢిల్లీ UPSCకి వెళ్లిన విద్యార్థి అదృశ్యం

మనోహరాబాద్ మండలం పోతారం గ్రామ యువకుడు అదృశ్యమైనట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. మయూడి అనిల్ కుమార్ (28) ఈనెల 7న ఢిల్లీలో యుపీఎస్సీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. 11న కుటుంబీకులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అతడి కోసం ఆరా తీశారు. ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సోదరుడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.