News March 29, 2024
కొత్తకోట: పోక్సో కేసులో యువకుడికి రిమాండ్
ఓ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన యువకుడిని కొత్తకోట పోలీసులు జైలుకు పంపించారు. SI మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాటవెల్లికి చెందిన ఓ బాలికను వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కాగా బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
Similar News
News January 26, 2025
జడ్చర్ల: లచ్చన్న దళం పేరుతో.. ఎమ్మెల్యేకి మావోయిస్టుల లేఖ
రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు లచ్చన్న దళం మావోయిస్టుల పేరుతో లేఖను అతికించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటికి మరోసారి లచ్చన్న దళం పేరుతో లేఖ రాశారు. ‘ఎమ్మెల్యేగా మంచిగా వ్యవహరించు.. గర్వం ఉంటే ఎప్పటికీ మంత్రి కాలేవు. దయచేసి జాగ్రత్తగా ఉండు. ఇట్లు లచ్చన్న దళం’ అంటూ లేఖలో ఉంది.
News January 26, 2025
MBNR: సంక్షేమ పథకాల అమలకు నేడే శ్రీకారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను నేటి నుంచి ప్రారంభించనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.
News January 25, 2025
MBNR: BC స్టడీ సర్కిల్.. APPLY చేసుకోండి.!
ఉమ్మడి బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ అభివృద్ధి అధికారి ఆర్.ఇందిర, డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. MBNR, NGKL, NRPT జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 12,13,14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.