News March 7, 2025

కొత్తకోట: రోడ్డు ప్రమాదంలో సీడీసీ ఛైర్మన్ మృతి

image

సీడీసీ ఛైర్మన్ పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి(55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సాకారంతో ఉమ్మడి జిల్లా సీడీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గురువారం హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కొత్తకోటతో పాటు కాంగ్రెస్ పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News November 1, 2025

NRPT: అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్ సర్వీసు

image

పౌర్ణమి సందర్భంగా నారాయణపేట ఆర్టీసీ డిపో నుంచి అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక లగ్జరీ బస్ సర్వీసు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ఈ నెల 3న సాయంత్రం 6 గంటలకు బస్సు బయలుదేరి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదక్షిణ, దర్శనం అనంతరం 5న తిరుగు ప్రయాణం అవుతుందని; పెద్దలకు రూ. 4వేలు, పిల్లలకు రూ.2,800 ఛార్జీ ఉంటుందని ఆమె చెప్పారు.

News November 1, 2025

OCT జీఎస్టీ వసూళ్లు ₹1.96L కోట్లు

image

ఈ ఏడాది అక్టోబర్‌లో ₹1.96L కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్(₹1.87L కోట్లు)తో పోలిస్తే 4.6 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. రిఫండ్ల తర్వాత నెట్ కలెక్షన్లు ₹1.69L కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇక 2024 ఏప్రిల్-అక్టోబర్ మధ్య ₹12.74L కోట్లు వసూలవ్వగా, ఈ ఏడాది అదే సమయంలో 9 శాతం వృద్ధితో ₹13.89L కోట్లు ఖజానాలో చేరినట్లు వివరించింది.

News November 1, 2025

NLG: ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశాం: కలెక్టర్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో నల్గొండ జిల్లాలోని 10 మండలాల పరిధిలో కొంతమేరకు తడిసిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 4,600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసినట్లు పేర్కొన్నారు.