News March 7, 2025
కొత్తకోట: రోడ్డు ప్రమాదంలో సీడీసీ ఛైర్మన్ మృతి

సీడీసీ ఛైర్మన్ పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి(55) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సాకారంతో ఉమ్మడి జిల్లా సీడీసీ ఛైర్మన్గా నియమితులయ్యారు. గురువారం హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కొత్తకోటతో పాటు కాంగ్రెస్ పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News December 10, 2025
100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 10, 2025
ఖమ్మం: ఓటు వేయాలంటే.. గుర్తింపు కార్డులే ఆధారం!

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ రేపు జరగనుంది. ఉద్యోగులు పంపిణీ చేసే ఓటరు స్లిప్ను కేవలం సమాచారం కోసమే వినియోగించాలని, అది గుర్తింపు పత్రంగా చెల్లదని అధికారులు స్పష్టం చేశారు. ఓటు వేయడానికి ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, పట్టాదారు పాస్బుక్ సహా 18 రకాల గుర్తింపు పత్రాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా చూపించాలని అధికారులు ఓటర్లకు సూచించారు.
News December 10, 2025
IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీ(IIM) 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iimranchi.ac.in


