News October 25, 2024
కొత్తగా ఒక్క అక్రమ నిర్మాణం జరిగినా అత్యంత కఠిన చర్యలు: కలెక్టర్

ఖమ్మం కార్పొరేషన్లో కొత్తగా ఒక్క అక్రమ నిర్మాణం జరిగినా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించాలని గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో త్రాగునీటి సరఫరా బిల్లులను ఎప్పటికప్పుడు వసూలు చేయాలని, త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు.
Similar News
News December 12, 2025
ప్రభుత్వ ఫార్మా బలోపేతానికి చర్యలేంటి?: ఎంపీ

దేశంలో ఫార్మా పీఎస్యూ (పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్) రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ప్రస్తుత పీఎస్యూల ఆధునికీకరణ ప్రణాళికలేంటో లోక్సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. దీనికిగాను కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
News December 12, 2025
విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక: అదనపు కలెక్టర్

విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. వరదలు, పరిశ్రమ ప్రమాదాలు, ఇతర ప్రమాదాల నియంత్రణపై శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో విపత్తుల నిర్వహణ అథారిటీ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భారీ వరదల సమయంలో నీటి విడుదల కోసం పైనున్న ప్రాంతాలు, దిగువ ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ ఉండాలని సూచించారు.
News December 12, 2025
బోనకల్ సర్పంచ్గా భార్య, వార్డు సభ్యుడిగా భర్త విజయం

బోనకల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాణోత్ జ్యోతి సర్పంచ్గా ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి భూక్య మంగమ్మపై 962 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈ విజయం కంటే ఆసక్తికరంగా, జ్యోతి భర్త బాణోత్ కొండ 4వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఈ అపూర్వ విజయంతో గ్రామంలో వారి అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.


