News March 27, 2025
కొత్తగూడెంలో నిరుద్యోగులకు GOODNEWS.. రేపే!

జిల్లాలో నిరుద్యోగ యువతకు భద్రాద్రి కొత్తగూడెం ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ గుడ్ న్యూస్ చెప్పారు. పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండి SSC, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలన్నారు. ప్రైవేటు కంపెనీల్లో 550 ఉద్యోగాలకు గాను ముఖాముఖి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News February 26, 2026
అల్లూరి: గంజాయి నిర్మూళనకు ‘ఆపరేషన్ సంయుక్త’

విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పాల్గొన్నారు. ఏజెన్సీలో గంజాయి ‘జీరో కల్టివేషన్’ సాధించిన విధానాన్ని ఒడిశా అధికారులకు వివరించారు. సరిహద్దుల్లో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఉమ్మడిగా ‘ఆపరేషన్ సంయుక్త’ చేపట్టాలని నిర్ణయించారు.
News February 26, 2026
ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు పరార్

దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి మార్కెట్లో దొరికే కాయిల్స్, క్రీమ్స్, మస్కిటో మ్యాట్ ప్రొడక్ట్స్ వాడతాం. వీటి ప్రభావం మనపై కూడా పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలంటున్నారు నిపుణులు. బంతి, తులసి, లావెండర్, రోజ్మేరీ, కలబంద మొక్కలు దోమలను తరిమేయడంలో సహకరిస్తాయి. అలాగే ఇంటి బయట వేప, యూకలిప్టస్ చెట్లను పెంచినా దోమల బెడద తగ్గుతుందంటున్నారు నిపుణులు.
News February 26, 2026
మోదీ ఇజ్రాయెల్ పర్యటన తర్వాత ఇరాన్‌పై అమెరికా దాడి: ఒవైసీ

మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గాజా మారణహోమానికి నెతన్యాహునే కారణమని ఆరోపించారు. ఆయన్ని ‘యుద్ధ నేరస్థుడి’గా అభివర్ణించారు. అలాంటి వ్యక్తిని మోదీ కౌగిలించుకోవడమేంటి అని ప్రశ్నించారు. ఇది పాలస్తీనాకు భారత్ అందించే చిరకాల మద్దతును దెబ్బతీయడమేనని విమర్శించారు.


