News February 13, 2025
కొత్తగూడెంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

భద్రాద్రి కొత్తగూడెంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 30 నుంచి 35 డీగ్రీల వరకు నమోదువుతున్నాయి. రాత్రి పూట చలికి.. పగటిపూట ఎండకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి పండ్ల రసాలు, కొబ్బరి బొండాల వైపు మొగ్గు చూపడంతో వాటి ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత వల్ల ప్రజలు రోడ్లపైకి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
Similar News
News July 9, 2025
ఎన్టీఆర్ జిల్లాలో బంగారు కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే.?

ఎన్టీఆర్ జిల్లాలో P-4 పథకంలో లబ్ధి పొందనున్న బంగారు కుటుంబాల సంఖ్య 86 వేలకు చేరిందని కలెక్టర్ లక్ష్మీశా చెప్పారు. ఈ కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు 400 మందికిపైగా మార్గదర్శకులు ఉన్నారన్నారు. పేదరికం లేని సమాజం తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఈ పథకంలో ఆయా కుటుంబాల సంక్షేమానికై మార్గదర్శకులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
News July 9, 2025
ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. డేటా విశ్లేషణ కోసం FSLకు పంపించారు. ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డును చేశారు. 2023 నవంబర్ 15-30 వరకు సర్వీస్ ప్రొవైడర్ డేటాలోని ఫోన్ నంబర్లు, డేటా రిట్రైవ్, హార్డ్ డిస్క్‌లోని రహస్యాలపై సిట్ ఆరా తీసింది. రేపు ప్రభాకర్ రావును సిట్ మరోసారి విచారించనుంది.
News July 9, 2025
BHPL: త్వరలో నోటిఫికేషన్.. ఆశావహుల వ్యూహాలు

ఈ నెలాఖరులో పంచాయతీ, MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆశావహ అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ప్రజలను కలుస్తూ వారి ఉద్దేశ్యాన్ని వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా రిజర్వేషన్ కలిసి రాకపోతే పరిస్థితి ఏంటని పోటీ చేయాలనుకునే అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితులు అనుకూలించకపోతే, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచనలు చేస్తున్నారు.