News February 11, 2025
కొత్తగూడెం: అత్యాచారయత్నం.. తప్పించుకున్న యువతి

అనిశెట్టిపల్లి వద్ద <<15422862>>రాత్రి <<>> గ్రామస్థులకు ఓ యువతి లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. CGకి చెందిన యువతి(20) కొత్తగూడెంలోని బంధువుల ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేస్తోంది. ఉదయం ఆటోడ్రైవర్ పని ఇప్పిస్తానని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. సహకరించకపోవడంతో కత్తితో దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి గ్రామస్థులకు విషయం తెలిపింది. కేసు నమోదైంది.
Similar News
News November 17, 2025
నేటి నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్: డీఎంఓ

ఆసిఫాబాద్ జిల్లాలో జిన్నింగ్ (పత్తి) మిల్లుల బంద్ కారణంగా సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. సమస్య పరిష్కారం అయ్యే వరకు రైతులు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దని ఆసిఫాబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి అష్పక్ సూచించారు. సీసీఐ వారు జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో L1, L2 పద్ధతిని అనుసరించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగినట్లు ఆయన తెలిపారు.
News November 17, 2025
ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటా: బాలకృష్ణ

AP: ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటానని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. ప్రపంచంలో 50 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్నది తానొక్కడినేనని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ‘రాజకీయం అంటే ఏంటో ఎన్టీఆర్ నేర్పారు. బీసీలకు అధికారాన్ని పంచిన మహానుభావుడు’ అని అన్నారు. హిందూపురం ప్రజలకు తాను రుణపడి ఉంటానని చెప్పారు.
News November 17, 2025
నవంబర్ 17: చరిత్రలో ఈరోజు

*1920: తమిళ నటుడు జెమినీ గణేశన్ జననం
*1928: భారత జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ మరణం (ఫొటోలో)
*1972: సినీ నటి, రాజకీయ నేత రోజా సెల్వమణి జననం
*1978: నటి కీర్తి రెడ్డి జననం
*1982: మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ జననం
*2012: శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మరణం
*అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం


