News September 28, 2024

కొత్తగూడెం: ఆస్తమాతో ఇద్దరు చిన్నారుల మృతి

image

పినపాక మండలం మద్దులగూడెంలో శనివారం సాయంత్రం ఇద్దరు పసి పాపలు ఆస్తమాతో మృతి చెందారు. చిన్నారుల తల్లిదండ్రుల వివరాలిలా.. మద్దులగూడెం ఎస్టీ కాలనికి చెందిన ఇరుప మహేష్, మంజులకు రెండు నెలల బాబు.. పండా ప్రసాద్, మరియమ్మల రెండు నెలల పాప ఆస్తమాతో మృతి చెందారు. భద్రాచలం ఆసుపత్రిలో చూపించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల మృతితో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 12, 2024

కొత్తగూడెం: తాలిపేరు నదిలో పడి ఇద్దరు యువకులు మృతి

image

పండగ రోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామం పరిధిలోని తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి చనిపోయారు. మృతులు చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గట్టుపల్లి జంపన్న (23), సోయంలచ్చి (22)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 12, 2024

ఖమ్మం: శ్రీలక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి

image

విజయ దశమి పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామి దేవస్థానంలో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ పండితులు, అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వేదపండితులు ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళీ, గిడ్డంగుల ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఉన్నారు.

News October 12, 2024

ఖమ్మం: ముగ్గురిపై కేసు నమోదు: సీఐ

image

మహిళకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. జిల్లా ఆస్పత్రి MCHలో ఓ మహిళా ఉద్యోగికి సహోద్యోగి సురేశ్ మద్యం తాగి ఫోన్ చేశాడు. ఆస్పత్రిలో సిబ్బంది శ్రీకాంత్, సత్యకుమార్‌కు ఆమెతో వివాహేతర సంబంధం ఉందని చెప్పారని, తనతోనూ ఏకాంతంగా గడపాలంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. బాధితురాలు షీటీమ్స్‌ను ఆశ్రయించగా విచారణ అనంతరం ఆ ముగ్గురిపై కేసు నమోదైంది.