News April 1, 2025
కొత్తగూడెం: ఇంటర్ లాకింగ్ కారణంగా ఆ రైళ్లు రద్దు.!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 32 రైళ్లు రద్దయినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. మరో 11 రైళ్ల దారి మళ్లించినట్లు పేర్కొంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని కోటార్లియా స్టేషన్లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రెండు రైళ్లు రద్దు చేశారు. విజయవాడ – భద్రాచలం (67215) రైలు, భద్రాచలం – విజయవాడ (67216) రైలును మే 23 నుంచి మే 29 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News November 27, 2025
గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఫిర్యాదులకు ఆన్లైన్ పోర్టల్

గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వివిధ అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని ఇంచార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. ఓటర్ల జాబితా, నామినేషన్లు, ఓట్ల లెక్కింపు ఇతర అంశాలపై కింద ఇచ్చిన ఆన్లైన్ పోర్టల్ https://grievance.tsec.gov.in/home ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
News November 27, 2025
రౌడీషీటర్స్ సంస్కరణ దిశగా రాచకొండ కమిషనరేట్

రాచకొండ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. రౌడీషీటర్లను సంస్కరించే దిశగా ఉప్పల్, ఎల్బీనగర్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణలో భాగస్వాముల్ని చేశారు. తప్పులు దిద్దుకుని ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వారు స్వాగతిస్తున్నారు. సమాజ మార్పు వైపు రాచకొండ కమిషనరేట్ పోలీసుల ముందడుగు వేశారు.
News November 26, 2025
రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం: CM

AP: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు న్యాయం జరగాలని, సాంకేతిక ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కరించాలని CRDA సమీక్షలో సూచించారు. మరోవైపు రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని, నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు.


