News March 29, 2025
కొత్తగూడెం ఇఫ్తార్ విందులో కలెక్టర్, SP, MLA

మతసామరస్యాన్ని చాటుతూ.. లౌకిక విలువలను కాపాడుకుందామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ రెహమాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.షాబిర్ పాషాతో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజల మధ్య ఇఫ్తార్ విందు ఐక్యత భావం పెంచుతుందని వారు అన్నారు. సమాజంలో రంజాన్ మాసం శాంతి నెలకొల్పుతుందని తెలిపారు.
Similar News
News October 22, 2025
చిత్తూరు CDCMS పర్సన్ ఇన్ఛార్జ్ జేసీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(CDCMS)కి అఫిషియల్ పర్సన్ ఇన్ఛార్జ్గా జాయింట్ కలెక్టర్ విద్యాధరిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీ వరకు లేదా తిరిగి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. గతంలో నియమించిన సుబ్రహ్మణ్యం నాయుడు మృతిచెందిన సంగతి తెలిసిందే.
News October 22, 2025
మంచిర్యాల: ఆరు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి-దానాపూర్ మధ్య ఆరు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. అక్టోబర్ 23, 24, 26, 27, 28, 29 తేదీల్లో ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్ల మీదుగా వెళ్తాయి. ఫస్ట్ ఏసీ నుంచి జనరల్ క్లాస్ వరకు అన్ని సౌకర్యాలతో రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
News October 22, 2025
కార్తీక మాసంలో విష్ణుమూర్తికీ ప్రాధాన్యమెందుకు?

కార్తీక మాసానికి హరిహరుల మాసమని పేరుంది. ఈ నెలలో చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసి కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాల్లో ఉంది. అలాగే విష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడే ఆంజనేయుడిగా అవతరించి సహకరించాడని ప్రతీతి. హరిహరులిద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు. అందుకే ఈ మాసంలో భేదాలు లేకుండా శివుడిని, విష్ణుమూర్తినీ పూజించాలి.