News March 3, 2025
కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్లో కలెక్టర్ తనిఖీ

కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేస్తామని, ఇందులో భాగంగా ఈవీఎం గోడౌన్ను సందర్శించామని తెలిపారు. ఈ పరిశీలనలో భాగంగా ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు.
Similar News
News September 16, 2025
ఆంజనేయుడికి తన శక్తుల గురించి ఎందుకు తెలియదు?

ఆంజనేయుడు చాలా శక్తిమంతుడు. బాల్యం నుంచి ఆయనకు అనేక శక్తులు ఉన్నాయి. కానీ తన అల్లరి చేష్టల వల్ల రుషులు హనుమంతుడ్ని శపిస్తారు. అందువల్లే ఆయన తన శక్తులను మర్చిపోయాడు. రాముని సేవలో లంకకు వెళ్లాల్సిన సమయంలో జాంబవంతుడు ఈ శాపాన్ని గుర్తుచేశాడు. అప్పుడు మారుతీ తన శక్తులను తిరిగి తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ధర్మ సంస్థాపన కోసం మాత్రమే ఆయన తన శక్తులను ఉపయోగించారని పురాణాలు చెబుతున్నాయి.
News September 16, 2025
నరదిష్టి పోవాలంటే ఇలా చేయండి!

ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే నరదిష్టి పోవాలంటే జ్యోతిష నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. ‘సంద్రపు నీటిని ఇంటిపైన, వ్యాపార స్థలంలో చల్లాలి. దొడ్డు ఉప్పును ఎర్రటి వస్త్రంలో కట్టి మంగళవారం ఇంటి ముందు ఉంచాలి. బుధవారం పారే నీటిలో వేయాలి. ఆవు పేడ, పచ్చ కర్పూరం, పసుపు, కస్తూరి కలిపి అక్కడక్కడా చల్లాలి. ఉడికించిన బంగాళదుంపలను గోవుకు తినిపించడం కూడా శుభప్రదం’ అని చెబుతున్నారు.
News September 16, 2025
ఆమె ప్రతీకారమే.. పాండవుల విజయానికి కారణమైంది!

అంబ, శాల్వ మహారాజును ప్రేమించి, భీష్ముడి కారణంగా అతడిని కోల్పోయింది. దీనికి ప్రతీకారంగా భీష్ముడి చావుకు కారణమయ్యే వరం కోరి, ఆమె శిఖండిగా మళ్లీ జన్మించింది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు శిఖండిని చూసి ఆయుధాలను కింద పెట్టేస్తాడు. అలా శిఖండి తన పగను తీర్చుకుంటుంది. ఆమె వ్యక్తిగత పగతో భీష్ముడి చావుకు కారణమైనా, కౌరవ పక్షాన ఉన్న ధీరుడిని ఓడించడం ద్వారా.. ధర్మం గెలవడానికి ఆమె పరోక్షంగా తోడ్పడింది.