News March 13, 2025
కొత్తగూడెం: ఉపాధి పనులపై కలెక్టర్ సమీక్ష

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఉపాధి హామీ పథకం అమలు తీరు క్లస్టర్ వారీగా పని దినాలు చేపడుతున్న పనులపై వీసీ ద్వారా సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News November 9, 2025
రేవంత్ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు: కిషన్ రెడ్డి

TG: BJP, BRS కలిసిపోయాయని రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మాట్లాడుతూ ‘రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగినా భయపడను. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధికి BJP ఏం చేసిందో నాకు తెలుసు. రూ.లక్ష కోట్ల అవినీతిని బయట పెడతామని రాహుల్, రేవంత్ చెప్పి రూ.లక్ష కూడా వెలికితీయలేదు’ అని ఎద్దేవా చేశారు.
News November 9, 2025
10న ‘మీ కోసం’ రద్దు: ఎస్పీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈక్రమంలో ఈనెల 10న జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న ‘మీ కోసం’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ ‘మీ కోసం’ కార్యక్రమానికి రావద్దని సూచించారు.
News November 9, 2025
జగిత్యాల: క్వింటాల్ మక్కలు రూ.2,071

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ దినుసుల ధరలు ఇవాళ ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,071, కనిష్ఠ ధర రూ.1,600, వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.1,940, కనిష్ఠ ధర రూ.1,750, వరి ధాన్యం(BPT) గరిష్ఠ ధర రూ.2,041, కనిష్ఠ ధర రూ.1,980, వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,585, కనిష్ఠ ధర రూ.1,800గా పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.


