News October 30, 2024

కొత్తగూడెం: ‘ఎద్దుపై పులి దాడి ‘

image

కూనవరం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ బొదునూరులో ఎద్దుపై పులి దాడి చేసిందని రైతు సోడి శ్రీను తెలిపారు. పులి దాడిలో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిందని అన్నారు. కాగా ఎద్దుపై పులి దాడి చేయడంతో బొదునూరు గ్రామానికి చెందిన ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గ్రామ ప్రజలు పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని అందించారు.

Similar News

News November 5, 2024

పక్కా ప్రణాళికతో ఇంటింటి సర్వే: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కా ప్రణాళికతో, ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సుమారు 6,33,304 కుటుంబాలున్నట్లు అంచనా ఉందన్నారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

News November 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

∆} ఖమ్మం:వారికి రెండో ప్రాధాన్యతలో ఇల్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి ∆}భద్రాచలం: పవిత్ర గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు∆}ఖమ్మం: కారు- బైక్ ఢీకొని యువకుడు మృతి∆} దమ్మపేట:వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మల∆}భద్రాచలం: రూ. 3 కోట్ల గంజాయి దహనం చేసిన అధికారులు∆}కొత్తగూడెం: క్లినిక్ సీజ్ చేసిన వైద్యాధికారులు∆}గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి సీతక్క

News November 4, 2024

రేపటి బిసి కమీషన్ బహిరంగ విచారణ వాయిదా: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ బిసి కమీషన్ నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల బహిరంగ విచారణ అనివార్య పరిస్థితుల కారణంగా ప్రభుత్వం వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లాలోని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.