News May 12, 2024

కొత్తగూడెం: ఎన్నికల ఎఫెక్ట్.. ఆ రూట్ బంద్

image

13వ తేదీన పోలింగ్ నేపథ్యంలో చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో భారీ వాహనాలను 12న ఉదయం 5 గంటల నుంచి 14న ఉదయం 8 గంటల వరకు నిలిపి వేయాలని రంపచోడవరం రిటర్నింగ్ అధికారి పోలీసులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

Similar News

News November 17, 2025

లోక్ అదాలత్ ద్వారా 5838 కేసులు పరిస్కారం: CP

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్‌ అదాలత్‌‌కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 5838 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 5838 కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు-605, ఈ పెటీ కేసులు -2583, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 2650, సైబర్ కేసులు -195 పరిష్కరించడం ద్వారా రూ.92,45,636 బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు.

News November 16, 2025

స్థిరాస్తి లాటరీల మోసం.. అధికారులు దృష్టి సారించాలి

image

ఖమ్మం జిల్లాలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘1000 కట్టు-ఫ్లాటు పట్టు’ వంటి మోసపూరిత ప్రకటనలతో లాటరీలు నిర్వహిస్తూ ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా ఆర్థిక మోసాలను అరికట్టడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం వెంటనే దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అమాయక ప్రజలను ఈ మోసాల నుంచి రక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.

News November 16, 2025

ఖమ్మం: అంగన్వాడీల్లో కనిపించని సమయపాలన..

image

జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు బదులు ఆలస్యంగా కేంద్రాన్ని తెరవడం, అలాగే సాయంత్రం 4 గంటలకు ముందే 3 గంటలకే ఇంటికి వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ వెంటనే దృష్టి సారించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.