News May 12, 2024

కొత్తగూడెం: ఎన్నికల ఎఫెక్ట్.. ఆ రూట్ బంద్

image

13వ తేదీన పోలింగ్ నేపథ్యంలో చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో భారీ వాహనాలను 12న ఉదయం 5 గంటల నుంచి 14న ఉదయం 8 గంటల వరకు నిలిపి వేయాలని రంపచోడవరం రిటర్నింగ్ అధికారి పోలీసులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

Similar News

News February 18, 2025

బోరుబావుల నుంచి ఉబికి వస్తున్న వేడి నీరు..!

image

భద్రాద్రి జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మణుగూరు మండలం పగిడేరులో పలు బోరుబావుల నుంచి వేడి నీరు ఉబికి వస్తోంది. ఈ నీటిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండటం వంటి కారణాలతో వేడినీరు వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చి వేడినీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

News February 18, 2025

ఖమ్మం – సూర్యాపేట హైవే పై రోడ్డు ప్రమాదం

image

కూసుమంచి మండలంలో  ఖమ్మం – సూర్యాపేట హైవేపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హాట్యతండా సమీపంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారడంతో డీసీఎం వ్యాను డివైడర్‌‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

News February 18, 2025

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా 

image

 ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా చేసిన ఘటన పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. మండాలపాడుకు చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు.  పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. అతడితో పెళ్లి జరిపించాలని ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నాకు దిగింది.  ఆ యువతికి ఆగ్రామ మహిళలు మద్దతుగా నిలిచారు. 

error: Content is protected !!