News January 23, 2025
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుతో మరింత అభివృద్ధి: ఎంపీ

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం పుణ్యక్షేత్రం సందర్శన కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల సులభం అవుతుందని ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి తెలిపారు. సింగరేణి హెడ్ ఆఫీస్, KTPS, స్పాంజ్ ఐరన్, నవభారత్, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ పేపర్ బోర్డు ఇలా ప్రఖ్యాత పరిశ్రమలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయని వివరించారు. పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కదలిక తీసుకురావడం జరిగిందన్నారు.
Similar News
News December 5, 2025
కరీంనగర్: అభ్యర్థులకు కోతుల ‘పంచాయితీ’..!

కరీంనగర్ జిల్లాలోని పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. తొలి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామంలోని కోతుల ‘పంచాయితీ’ తీరిస్తేనే ‘పంచాయతీ’ పట్టం కడతామంటూ పలుచోట్ల అభ్యర్థులకు ఓటర్లు తెగేసి చెప్తున్నారు. దీంతో చేసేది లేక సమస్య తీరుస్తామని అభ్యర్థులు హామి ఇస్తున్నారు. మరి మీ గ్రామంలోనూ కోతుల సమస్య ఉందా?.
News December 5, 2025
ఇండిగో సంక్షోభం.. కేంద్రం సీరియస్

ఇండిగో విమాన సర్వీసుల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. మూడు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని వెల్లడించింది. పైలట్ల రోస్టర్ సిస్టమ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పింది.
News December 5, 2025
ఇవాళే ‘అఖండ-2’ రిలీజ్?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రాన్ని ఇవాళ రాత్రి ప్రీమియర్స్‌తో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. సమస్యలన్నీ కొలిక్కి రావడంతో ఏ క్షణమైనా మూవీ రిలీజ్‌పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. ఇవాళ సెకండ్ షోతో ప్రీమియర్స్, రేపు ప్రపంచవ్యాప్త విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. లేకపోతే ఈనెల 19కి రిలీజ్ పోస్ట్‌పోన్ కానున్నట్లు సమాచారం.


