News March 4, 2025
కొత్తగూడెం ఎయిర్‌పోర్టు.. వాతావరణ రిపోర్ట్ కీలకం

కొత్తగూడెం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో 900 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. గత జనవరి 23న AAI ఫీజిబులిటీ సర్వే నిర్వహించింది. మరిన్ని వివరాలు కావాలంటూ కేంద్ర వాతావరణ శాఖను కోరింది. ఆ వివరాలు వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టుకు ఎంపిక చేసిన ప్రదేశంలో గాలుల తీరుతెన్నులు, వర్షాలు తదితర అంశాలను బేరీజు వేస్తారు. సానుకూల ఫలితాలు వస్తే తదుపరి కార్యాచరణ మొదలయ్యే అవకాశముంది.
Similar News
News March 4, 2025
పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్

పాకిస్థాన్ టీ20 కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్ కోసం రిజ్వాన్‌ను తప్పించి సల్మాన్ అలీ అఘాకు పగ్గాలు అప్పగించింది. ఈ సిరీస్‌కు రిజ్వాన్‌తో పాటు మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్‌ను పక్కనపెట్టింది. అయితే వన్డేలకు మాత్రం రిజ్వాన్ కెప్టెన్సీ చేస్తారని వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.
News March 4, 2025
దేశం కోసం ప్రకాశం జిల్లా వాసి ప్రయత్నం!

ఒక నినాదం కోసం వేల మైళ్లు సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకాశం జిల్లా వాసి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంటూ రుద్రవారం వాసి సుభాశ్ చంద్రబోస్ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఏకంగా 50 వేల కి.మీ యాత్రలో భాగంగా 28 రాష్ట్రాలను చుట్టేశాడు. 41,223 కి.మీ సైకిల్ తొక్కి విశాఖ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చొరవతో రాష్ట్రపతికి ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అందజేయడం తన లక్ష్యమంటున్నాడీ కుర్రాడు.
News March 4, 2025
SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి

TG: SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. సొరంగంలో పనుల కోసం ఉపయోగించే కన్వేయర్ బెల్ట్ మరమ్మతులకు గురికాగా, సాంకేతిక సిబ్బంది దాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం అది పని చేస్తోంది. దీంతో సొరంగంలోని బురద, మట్టిని తొలగించే ప్రక్రియ వేగవంతం కానుంది. సొరంగంలో చిక్కుకుపోయిన 8మంది ఉద్యోగుల ఆచూకీ కోసం 10 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.