News January 11, 2025
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు 20న కేంద్ర బృందం రాక
భద్రాద్రి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు పర్యవేక్షణకు ఈ నెల 20న ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేక బృందం రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పనులు వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిని కోరగా, స్పందించారని వివరించారు. కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో అనువైన భూముల పరిశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విమానాశ్రయం నిర్మాణంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.
Similar News
News January 13, 2025
కూసుమంచిలో 30 రోజుల్లోనే ఇందిరమ్మ మోడల్ ఇల్లు పూర్తి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ మండలంలో ఒక నమూనా ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా గత నెల 13న మంత్రి పొంగులేటి కూసుమంచి ఎమ్మార్వో ఆఫీసు దగ్గర ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా నెల రోజుల్లోనే పూర్తి చేశారు. రాష్ట్రంలోనే తొలి నమునా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి వచ్చింది. రూ.5లక్షలతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కాంట్రాక్టర్ జీవన్ రెడ్డి తెలిపారు.
News January 13, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో ఐదుగురు మంత్రులు పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఉమ్మడి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం రద్దు
News January 13, 2025
KMM: రూ.22వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు: డి.సీఎం భట్టి
ఇందిరమ్మ ఇళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక అప్డేట్ ఇచ్చారు. రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. కానీ గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు.